TG: హైదరాబాద్‌లో ఏప్రిల్ 19న ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ముస్లింలతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు AIMIM పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. ఈ సభ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించనున్నారు. ఈ సభకు దేశవ్యాప్తంగా మతపెద్దలు, పలువురు రాజకీయ నేతలు హాజరు కానున్నారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం నాయకులు కూడా పాల్గొంటారు.