‘పుష్ప-2’ ఇండియన్ సినిమా రికార్డులన్నింటీని బ్రేక్ చేసింది. కేవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 32 రోజుల్లోనే రూ.1831 కోట్లు వసూలు చేసి బాహుబలి-2 రికార్డును బ్రేక్ చేసింది. బాహుబలి-2 ప్రపంచ వ్యాప్తంగా రూ.1810 కోట్లు వసూలు చేయగా పుష్ప-2 దానిని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది.