పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ ను హైదరాబాద్ ను ఘనంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 2న సాయంత్రం 6 గంటలకు యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకను అచ్చం ప్రీ రిలీజ్ ఈవెంట్ లెవల్లో చేస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనికి దాదాపు 2 లక్షలకు పైగా ఫ్యాన్స్ హాజరుకానున్నట్లు అంచనా. దీంతో భారీ బందోబస్తు మధ్యలో పుష్పగాడి మాస్ జాతర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.