ఉత్తర కొరియా పర్యటనకు పుతిన్‌

73చూసినవారు
ఉత్తర కొరియా పర్యటనకు పుతిన్‌
ఉత్తర కొరియా మీడియా కీలక ప్రకటన చేసింది. దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆహ్వానం మేరకు జూన్‌ 18-19వ తేదీల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉత్తర కొరియాలో పర్యటించనున్నట్లు తెలిపింది. ఉత్తర కొరియాలో పుతిన్‌ పర్యటించడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి. ఒకవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. ప్యాంగ్‌యాంగ్‌ ఆయుధ పరీక్షలు, ఇతర దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్