ప్రశ్నార్దకంగా వారి జీవితం..ఆమెకు ఏమైంది

213071చూసినవారు
ప్రశ్నార్దకంగా వారి జీవితం..ఆమెకు ఏమైంది
నా పేరు సంతోష్. నేను పీజీ,డీఈడీ చేశాను. మాది సంగారెడ్డి. హైదరాబాద్ లో ఒక ప్రైవేటు సెక్టార్ లో జాబ్ చేస్తున్నా. అదే కంపెనీలో పని చేసే భవాని నాకు పరిచయమయ్యింది. అసలు తాను ఎలా పరిచయమైందో నాకే గుర్తు లేదు. తుఫాన్ లా నా లైఫ్ లోకి వచ్చింది. తనది తూర్పు గోదావరి జిల్లా. మా ఆఫీసులోనే కుమారి అనే అమ్మాయి పని చేసేది. కుమారి నా గురించి ఓ రోజు బాగా చెప్పింది. అలా భవానినే నా నంబర్ తీసుకొని హాయ్ అని మెసేజ్ పెట్టింది. భవానితో అలా ఏర్పడిన పరిచయం చాటింగ్, ఫోన్ల వరకు వెళ్లింది.

ఒకే కంపెనీ కావడంతో ఇద్దరం రోజూ కలుసుకునేవాళ్లం. అలా మా ప్రాంతాలు వేరైనా మా మనసులు కలిశాయి. ఆమె నా బంగారం అనుకున్నాను. మా జీవితం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కలలు కన్నాను. ఇంతలో భవానీ డీఈడీ పూర్తయ్యి డీఎస్సీకి ప్రిపేర్ అవుతుంది. రోజూ తన గుడ్ మార్నింగ్ మెసేజ్ లతోనే నేను నిద్ర లేచే వాడిని. మళ్లీ తన గుడ్ నైట్ మెసేజ్ లతోనే పడుకునే వాన్ని. ఇద్దరం ఒకరి యోగా క్షేమాలు ఒక్కరం తెలుసుకునే వాళ్లం.

ఇంతలో భవానీ మా ప్రేమ విషయాన్ని తన చిన్నప్పటి స్కూల్ సారుకు చెప్పింది. సారు ముందు డీఎస్సీ ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టూ. తర్వాత మిగతావి ఆలోచించవచ్చని అన్నాడట. ఇంతలో సారు ఓ రోజు భవానీ వాళ్ల ఇంటికి వెళ్లాడు. భవానీ తల్లిదండ్రులతో మా ఫ్రెండ్ తెలంగాణ వ్యక్తి ఉన్నాడు. భవానీని ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడట. అప్పుడు భవానీ తల్లిదండ్రులు అంత దూరం ఇవ్వం..వద్దూ అని అన్నారట.

ఆ తర్వాతి నుంచి ఏమైందో ఏమో నాకు తెలియదు. భవానీ మనస్సు మార్చుకుంది. నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఫోన్ చేస్తే విసిగించకు అని అంటుంది. హైదరాబాద్ లో కూడా తాను ఉండడం లేదు. తను ఎక్కడ ఉండేది కూడా నాకు తెలియకుండా చేస్తుంది. అప్పటి వరకు మంచిగా ఉన్న భవానీ సడన్ గా ఇలా ఎందుకు మారిపోయింది. ఏమై ఉంటుంది అనే పిచ్చి ఆలోచనలు నా మనస్సును కకావికలం చేస్తున్నాయి.

భవానీ కోసం ప్రతి నిమిషం బాధపడుతున్నా. తనతో గడిపిన గుర్తులు జ్ఞాపకమొచ్చి తల్లడిల్లుతున్నా. మేము ఇద్దరం గొడవ పడింది లేదు..కొట్టుకుంది లేదు..తిట్టుకుంది లేదు..అపార్దం చేసుకుంది లేదు..నన్ను దూరం పెట్టిన భవానీ కనీసం కారణం చెప్పినా బాగుండు అని అనిపిస్తుంది. కానీ అసలు తన అడ్రసే లేకుండా ఎందుకు జాగ్రత్త పడుతుందో తెలియడం లేదు.

తల్లిదండ్రులు ప్రాంతం వేరని అన్నంత మాత్రానా ఇంతలా దూరం పెట్టదని అనుకుంటున్నాను. దీని వెనుక ఏదో బలమైన కారణమే ఉండొచ్చు. భవానీ నువ్వే నా జీవితం అనుకున్నాను. కానీ నువ్వు నన్ను ఎందుకు దూరం పెట్టావో అర్ధం కావడం లేదు. నన్ను పిచ్చివాన్ని చేయకుండా కారణం చెప్పు భవానీ. నీ స్వచ్చమైన ప్రేమ కోసం ఎదురుచూస్తున్న సంతోష్ ని.
మిత్రులారా.. అందరిలాగే నేను కూడా నా జీవితం పై కలలు కన్నాను. నాకు చెడు అలవాట్టు కూడా లేవు. కానీ సడన్ గా భవానీ ఎందుకు దూరం పెట్టిందో తెలియడం లేదు. అసలు ఏం చేయాలో కూడా అర్దం కావడం లేదు.

ఇట్లు మీ మిత్రుడు.. సంతోష్

"చెప్పాలని ఉంది"

చాలా మందికి ప్రేమ ఓ మధుర జ్ఞాపకం కొందరికి ఆ ప్రేమ సంతోషాన్నిస్తే మరికొందరికి జ్ఞాపకంగా మిగులుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా... జీవితంలో విజయం సాధించిన వారు ఎందరో.. అటువంటి జ్ఞాపకాలను లోకల్ యాప్... “చెప్పాలని ఉంది” లో షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. లవ్ ఫెయిల్యూర్ అయినా.. సక్సెస్ అయినా మీరు మీ కథను పంపవచ్చు. మీరు పంపిన మీ కథను ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రచురిస్తాం. మీరు మీ కథను content@getlokalapp.com కు మెయిల్ చేయాలి.

ఈ కథనం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

సంబంధిత పోస్ట్