'రాజస్థాన్ ముఠా 200కు పైగా సైబర్ నేరాలకు పాల్పడింది'
By Shashi kumar 56చూసినవారుతెలంగాణలో రాజస్థాన్ ముఠా 200కు పైగా సైబర్ నేరాలకు పాల్పడిందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖ గోయల్ వెల్లడించారు. HYDలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 'రాజస్థాన్‌లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసు భారీ ఆపరేషన్ చేపట్టింది. జయపుర, నాగౌర్, జోధ్‌పూర్‌లో సైబర్ సెక్యూరిటీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిందితులపై దేశవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. నిందితులు ఇప్పటివరకు రూ. 11 కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తించాం' అని తెలిపారు.