లగచార్ల లో జిల్లా కలెక్టర్, అధికారులపై జరిగిన దాడిపై చేవెళ్ల నియోజకవర్గం శాసనసభ్యులు కాల యాదయ్య మంగళవారం స్పందించారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ. గత ప్రభుత్వంలో చాలా సందర్భాలలో రైతుల నుండి భూసేకరణ చేసినప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని ఈ సంఘటన చాలా బాధాకరమని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులపై రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం దాడులు జరగడం విషాదకరమైన సంఘటన అన్నారు.