రేపు సహకార సంఘం సమావేశం

72చూసినవారు
రేపు సహకార సంఘం సమావేశం
బాట సింగారం రైతు సేవా సహకార సంఘం ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నిర్వహించనున్నట్లు మేనేజర్ రాకేశ్ గౌడ్ తెలిపారు. జిల్లా సహకార అధికారి ఆదేశాల మేరకు సంఘం చైర్మన్ చేగూరి భరత్ కుమార్ అధ్యక్షతన సంఘం కార్యాలయంలో ఉదయం 10గంటలకు సమావేశాన్ని నిర్వహించి రైతు భరోసా పథకంపై సంఘ సభ్యుల సూచనలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. సభ్యులంతా సకాలంలో సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్