ఇబ్రహీంపట్నం: ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టిఏ అధికారుల కొరడా

64చూసినవారు
పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద ప్రవైట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు చేశారు. హైదరాబాద్ నుండి వెళ్ళే ప్రతి బస్సును క్షుణంగా తనిఖీలు చేశారు. ఫైర్ సేఫ్టీ పాటించని పలు బస్సులను గుర్తించి, టికెట్ రేట్లు గురించి ప్యాసింజర్లను అధికారులు అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పలు బస్సులను సీజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్