రంగారెడ్డి: పేదలకు సంక్షేమం అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం

72చూసినవారు
రంగారెడ్డి: పేదలకు సంక్షేమం అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం
పేద ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పనులు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఎల్గొండగూడ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, చేవెళ్ల ఆర్డిఓ చంద్రకళ, షాబాద్ ఎంపీడీఓ అపర్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి లబ్ది చేకూరుతుందన్నారు.