బండలేముర్ గ్రామ యువత కు క్రికెట్ కిట్ అందజేసిన జెర్కోని రాజు
ఇబ్రహీంపట్నం యువజన విభాగం అధ్యక్షుడు జెర్కోని రాజు బండలెముర్ గ్రామాని చెందిన బివైఎఫ్(BYF)టీం యువత కు శుక్రవారం క్రికెట్ కిట్అందజేశారు. ఆయన మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించి యువతకు చేయుతనివ్వాలని అన్నారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం పొందవచ్చన్నారు. యువత క్రీడాకారులుగా ఎదిగి గ్రామంతో పాటు నియోజకవర్గనికి వన్నె తేవాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్ కుమార్, ,నియోజకవర్గ ప్రచార కార్యదర్శి చింతకింది విరేశ్, కోంకని విజయ్, చెనమోని శివ ప్రసాద్, శ్రవణ్, జైపాల్,శంకర్,రాజేష్,నవీన్, తదితరులు పాల్గొన్నారు.