హైదరాబాద్: ‘ఫుడ్ పాయిజనింగ్ ఘటనల వెనక కుట్ర ఉంది’

61చూసినవారు
హైదరాబాద్: ‘ఫుడ్ పాయిజనింగ్ ఘటనల వెనక కుట్ర ఉంది’
హైదరాబాద్: ఫుడ్ పాయిజనింగ్ ఘటనల వెనక కుట్ర ఉందని మంత్రి సీతక్క అన్నారు. కుట్ర ఎవరు చేశారనేది బయటపెడతామని గురువారం తెలిపారు. కుట్రదారుల వెనుక అధికారులుంటే వారిని ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పారు. వరుస ఘటనల వెనుక రాజకీయ పార్టీ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తాము మెరుగైన చికిత్స అందించినప్పటికీ విద్యార్థిని శైలజ మరణించిందని తెలిపారు. ఆ విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్