హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగులు కారు అద్దాలను పగులగొట్టి రూ. 2 లక్షలు నగదు ఎత్తుకెళ్లిన ఘటన బుధవారం వెలుగుచూసింది. ఎల్బీనగర్, చింతలకుంట, సరస్వతీనగర్‌కు చెందిన వాకిటి సుధాకర్‌రెడ్డి (33) హయత్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్లాటు రిజిస్టేషన్ కోసం స్నేహితుడి కారులో వచ్చాడు. డాక్యుమెంట్ తయారీ కోసం సుధాకర్‌రెడ్డి వెళ్లి వచ్చేసరికి.. కారులో ఉన్న రూ.2 లక్షలు కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.