సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం కుల గణన, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు చేపట్టినట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. శుక్రవారం పూలే జయంతి వేడుకలను ఆయన గృహంలో ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ బహుజన చైతన్య దీప్తి, వివక్షలపై పోరాడి మహిళా విద్యకు కృషి చేసిన సంఘసంస్కర్త పూలే అని కొనియాడారు.