ఆమనగల్లు పట్టణంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి బాధితులు విజ్ఞప్తి చేశారు. విస్తరణలో ఇండ్లు కోల్పోయి తమ కుటుంబాలు అద్దె ఇండ్లలో జీవనం సాగిస్తున్నారని వారు పేర్కొన్నారు. తమకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వారు కోరారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.