తలకొండపల్లి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన సుధీర్ రెడ్డికి మంజూరైన 75 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఆదివారం కాంగ్రెస్ నాయకులు అందజేశారు. బాధితుడు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఆయనకు మంజూరు చేసిన చెక్కును నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, అచ్చిరెడ్డి లు అందజేశారు.