తలకొండపల్లి: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

84చూసినవారు
తలకొండపల్లి: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన మీసాల జంగయ్య (40) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ చెప్పారు. కుటుంబ అవసరాల నిమిత్తం అప్పులు చేసిన ఆయన తీర్చలేక తీవ్ర మనస్థాపానికి గురై ఈనెల 24న పురుగుల మందు సేవించగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఆయన వివరించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్