బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదావారం వికారాబాద్ జిల్లా బోంరాస్ పేట మండలంలో బోజన్నపేట తండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయినట్టు ఎస్ ఐ శ్రీశైలం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ కు చెందిన యాదయ్య వ్యాపార నిమిత్తం వికారాబాద్ లో ఉంటున్నారు. ఓమ్నీ వాహనంలో బల్బ్ లు అమ్ముతుంటారు.కొడంగల్ నుంచి పరిగి వైపు వెళ్తున్న వాహనం అదుపుతప్పి గోడకు ఢీ కొట్టింది. వాహనం నడుపుతున్నయాదయ్య అక్కడికి అక్కడే మృతి చెందగా,పక్కన కూర్చున్న సోదరుని కూతురు అనూషకు తీవ్ర గాయాలయ్యాయి.కుమారుడిని ప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేపట్టారు.