బీజేపీ సభ్యత్వ నమోదు భారీగా చేపట్టాలి: మారుతీ కిరణ్

73చూసినవారు
బీజేపీ సభ్యత్వ నమోదు భారీగా చేపట్టాలి: మారుతీ కిరణ్
సుస్థిర భారత్‌ కోసం బీజేపీ సభ్యత్వం పొందాలని బీజేపీ పరిగి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మారుతికిరణ్‌ తెలిపారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని ఇప్పాయిపల్లిలో ఆదివారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందని మారుతి కిరణ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్