ప్రభుత్వ ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలి : జైపాల్ రెడ్డి

50చూసినవారు
ప్రభుత్వ ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలి :  జైపాల్ రెడ్డి
రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ డివిజన్ పరిధిలోఆదివారం మున్సిపల్ కార్మికుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించి, ప్రభుత్వ ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్