ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శుక్రవారం సాయంత్రం కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ… అదనపు ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా అంతు చూస్తా నంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గం పీఎస్‌లో పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.