రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ఢీకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి చెందిన ప్రమాద ఘటన సోమవారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అతివేగంతో వెళుతున్న కారు అదుపు తప్పి ముందున్న బైకును ఢీ కొట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్న శ్రీవాణి (21) మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు శ్రీవాణి కామారెడ్డి వాసిగా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.