షాద్ నగర్ పట్టణం లో మినీ ట్యాంక్ బండ్

85చూసినవారు
షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని జానమ్మ చెరువు అభివృద్ధిలో భాగంగా మినీ ట్యాంక్ బండ్ గా మార్చేందుకు రెండు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోయే పనులకు సోమవారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. పాలకులు ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలను పక్కనపెట్టి నిస్వార్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్