రాష్ట్ర ప్రజలకు, ప్రజా సంస్థల చైర్మన్ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బుధవారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అసమానతల చీకట్లను పారదోలి తోటి వారి జీవితాల్లో వెలుగులు పంచేలా దివ్వెల పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో నియంతృత్వ చీకట్లను తరిమి ప్రజాస్వామ్య వెలుగులు పూయించిన ప్రజలకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.