మైల్వార్ ఫారెస్ట్ లో నీలగిరి చెట్లపై గొడ్డలి వేటు

85చూసినవారు
మైల్వార్ ఫారెస్ట్ లో నీలగిరి చెట్లపై గొడ్డలి వేటు
బషీరాబాద్‌ మండలం నీళ్లపల్లి-మైల్వార్‌ రిజర్వు ఫారెస్ట్‌లో ఆటవి శాఖ అధికారులు అప్పట్లో నీలగిరి మొక్కలు పెద్దసంఖ్యలో నాటి పెంచగా నేడు అవి వృక్షాలయ్యాయి. ఈ నీలగిరి వృక్షాలను అక్రమార్కులు కొందరు గుట్టుచప్పుడు కాకుండా గొడ్డలితో నరికి తరలిస్తున్నారు. ఇదంతా అటవీశాఖ అధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. చెట్ల నరికివేతను అడ్డుకొని, అడవులను పరిరక్షించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్