బందీపూర్ టైగర్ రిజర్వ్ లో అరుదైన చిరుత పులి

59చూసినవారు
బందీపూర్ టైగర్ రిజర్వ్ లో అరుదైన చిరుత పులి
కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ లో అరుదైన చిరుత పులి కనిపించింది. రెండు వేర్వేరు రంగులు కలిగిన కళ్లతో ఉన్న ఈ చిరుతపులిని ఫొటోగ్రాఫర్ ధ్రువ్ పాటిల్ తన కెమెరాలో బంధించారు. సఫారీలో పాల్గొన్న ఆయన చెట్టుపై ఉన్న చిరుతను ఫొటో తీసి గమనించగా ఓ కన్ను నీలం- ఆకుపచ్చ, మరోటి గోధుమ రంగుతో కనిపించాయి. హెటెరోక్రోమియా వల్ల ఇలా కళ్ల రంగు మారి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్