ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల స్వైర విహారం(వీడియో)

70చూసినవారు
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం గ్వాలియర్ లోని కమల రాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆసుపత్రిలోని ఓ వార్డులో ఎలుకలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఈ వీడియోను మధ్యప్రదేశ్‌లోని ప్రతిపక్ష కాంగ్రెస్ మంగళవారం తన X హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఆసుపత్రిలో “రోగుల కంటే ఎలుకలు ఎక్కువ” అని పేర్కొంటూ, రాష్ట్రంలోని ఆరోగ్య సౌకర్యాల పరిస్థితిపై ప్రభుత్వాన్ని విమర్శించింది. ఈ సమస్య నివారణకు చర్యలు తీసుకోనునట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్