ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నోయిడాలోని 10-11 సెక్టార్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందన్నారు.