రేవ్ పార్టీ వివాదం.. ‘ఉడ్తా బెంగళూరు’పై మాటల యుద్ధం

542చూసినవారు
రేవ్ పార్టీ వివాదం.. ‘ఉడ్తా బెంగళూరు’పై మాటల యుద్ధం
ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఉదంతం రాజకీయ వివాదానికి దారితీసింది. సిద్ధరామయ్య ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది బీజేపీ. సిలికాన్ సిటీని 'ఉడ్తా బెంగళూరు'గా మార్చారని ఆరోపించింది. బెంగళూరుపై భాజపా చేసిన ఆరోపణలను రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర తప్పుపట్టారు. మాదకద్రవ్యాల వాడకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఇప్పటికే రూ.కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేసి ధ్వంసం చేశామని చెప్పారు.
Job Suitcase

Jobs near you