100 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ

70చూసినవారు
100 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ
ఇంగ్లాండ్‌లో 1991 నుంచి దాచిన బంగారంలో 100 టన్నులను రిజర్వు బ్యాంకు వెనక్కి తీసుకొచ్చింది. కొన్ని నెలల్లో దాదాపు ఇదే పరిమాణంలో మరోసారి పసిడి సంపదను దేశంలోకి తీసుకొస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2024 మార్చి నాటికి ఆర్బీఐ 822.10 టన్నుల బంగారం కలిగి ఉంటే ఇందులో 408.31 టన్నులు దేశీయ వాల్టుల్లో ఉన్నాయి. 1991లో ఆర్థిక సంక్షోభంతో దేశీయంగా బంగారం విలువ పతనం కాకుండా ఇంగ్లాండ్‌కు ఆర్బీఐ తరలించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్