లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పంత్ మాట్లాడాడు. మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ తనను తీసుకుంటుందేమోనని టెన్షన్ పడ్డానని పేర్కొన్నాడు. ‘వేలం రోజు నాకు ఒకే ఒక టెన్షన్ ఉంది. అది పంజాబ్ కింగ్స్. వారి వద్ద అత్యధిక పర్సు ఉంది. శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ జట్టు దక్కించుకోవడంతో నేను లక్నోలో చేరగలనని భావించాను. కానీ, చివరికి వేలంలో ఏం జరుగుతుందో తెలీదు. దీంతో టెన్షన్ పడ్డా’ అని తెలిపాడు.