మద్యం తాగేటప్పుడు ఏది దొరికితే అది తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఆల్కహాల్ అనేది స్వతహాగా అసిడిటీని కలిగిస్తుంది. ఈ క్రమంలో కారం ఉండే ఆహారాలను తింటే అసిడిటీ ఎక్కువవుతుంది. దీని వల్ల కడుపులో తీవ్రమైన మంట వస్తుంది. చీజ్, జున్ను, పాలు, బటర్, వేయించిన పప్పులు, మాంసం, చిప్స్, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. గ్రీన్ సలాడ్, ఫ్రూట్స్‌కి ప్రాధాన్యత ఇస్తే మంచిది.