కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB) నేడు హైదరాబాద్ జలసౌధలో కీలక సమావేశం కానుంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ భేటీ ఉ. 11గంటలకు జరగనుంది. నాగార్జున సాగర్ భద్రతకు సంబంధించిన నిఘా, తనిఖీలు, పర్యవేక్షణ తమ పరిధిలోనే ఉండాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అటు సాగర్, శ్రీశైలంలోని కాంపొనెంట్లను కృష్ణాబోర్డుకు అప్పగించాలని, ప్రాజెక్టుల రక్షణ CRPFకు ఇవ్వాలని AP కోరుతోంది. ఈ అంశాలే అజెండాగా భేటీ జరగనుంది.