లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత RSS చీఫ్ మోహన్ భగవత్ నాగ్‌పూర్‌లో మంగళవారం మాట్లాడారు. నిజమైన 'సేవక్' మర్యాదను కొనసాగించడం ద్వారా ప్రజలకు సేవ చేయాలని, అహంకారాన్ని ప్రదర్శించకూడదని అన్నారు. RSS కార్యకర్తల్లో అహంకారం ఉండకూడదన్నారు. మణిపూర్ 10 ఏళ్లుగా ప్రశాంతంగా ఉందని, కానీ అక్కడ ఏడాదిగా పరిస్థితి మారిందన్నారు. తుపాకీ సంస్కృతి పెరిగిందని, సమస్యను చక్కదిద్దాలని అన్నారు.