మీ దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే కాఫీ తాగిన వెంటనే బ్రష్ చేయకండి

58చూసినవారు
మీ దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే కాఫీ తాగిన వెంటనే బ్రష్ చేయకండి
కాఫీ తాగిన తర్వాత కనీసం 30 నిమిషాల వరకు పళ్లు తోముకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కాఫీలోని ఎసిడిటీ వల్ల పంటి ఎనామిల్ పొర తాత్కాలికంగా బలహీనంగా మారుతుందని వైద్య నిపుణులు తెలిపారు. "కాఫీ తాగాక ఎనామిల్ మృదువుగా ఉంటుంది. ఆ టైంలో బ్రష్ చేయడం వల్ల ఈ నష్టం మరింత తీవ్రం అవుతుంది. ఇది ఎనామిల్ కోతకు దారితీస్తుంది. దీనివల్ల దంతాల సున్నితత్వం పెరగడంతో పాటు దంత క్షయం ఏర్పడొచ్చు" అని నిపుణులు చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్