పశ్చిమ బెంగాల్‌లో వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన 'నబన్నా అభియాన్' ర్యాలీ ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. హావ్‌డా నుంచి ర్యాలీగా వస్తున్న విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో బారికేడ్లను బద్దలు కొట్టేందుకు విద్యార్థులు ప్రయత్నించగా, పోలీసులు వారిపైకి బాష్పవాయువు ప్రయోగించారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.