తిరుమల శ్రీవారి కొండ సమీపంలో 'పుష్ప-2'లోని కిస్సిక్ పాటకు ఓ యువతి డాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో తాజాగా సదరు యువతి క్షమాపణలు చెప్పింది. 'క్లెమేట్ బాగుందని, ఆ పాట ట్రెండ్ అవుతోందని రీల్ చేశా. తెలిసో, తెలియక ఇలా చేశా. అది తప్పుగా వెళ్తుందని నేను ఊహించలేదు. మళ్లీ అలా చేయను. నన్ను చూసి అలా ఎవరూ చేయకండి. దయచేసి టీటీడీ ఛైర్మన్ నన్ను క్షమించాలి' అంటూ వీడియో రిలీజ్ చేసింది.