బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై పోలీసులు చేపట్టిన విచారణపై స్టే విధించింది. డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో గత ఏడాది జులై 3న ఆమెను పోలీసులు అరెస్ట్ చేయగా 10 రోజులకు బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని హేమ కోర్టును ఆశ్రయించగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.