విలన్‌గానే కాకుండా హాస్యనటుడిగానూ పేరు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించిన ఈయన ప్రస్తుతం దయనీయస్థితిలో ఉన్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్‌ని ఇంటర్వ్యూ చేయగా తాను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకు రూ. 2లక్షలు ఆర్థిక సాయం చేశారు. దీంతో ట్విటర్‌లో ఫిష్ వెంకట్ ఎమోషనల్ కాగా వీడియో వైరల్ అవుతుంది.