గుంటగలగర ఆకులతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గుంటగలగర మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. గుంటగలగర ఆకుల రసాన్ని భోజనానికి ముందు తాగితే గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఆరికాళ్లు, ఆరిచేతులలో మంట, దురద, కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. ఈ ఆకులను నీటితో మెత్తగా నూరి ఆ ముద్దను గజ్జి, తామర, దద్దుర్లు, పుండ్లు ఉన్న చోట పెడితే.. అవి తగ్గిపోతాయి.