రెమాల్ తుఫాన్.. తెలంగాణకు ఎల్లో అలర్ట్

15921చూసినవారు
రెమాల్ తుఫాన్.. తెలంగాణకు ఎల్లో అలర్ట్
తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీచేశారు. రెమాల్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్‌తో పాటు.. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, సూర్యాపేట. నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపారు. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్