వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. నిన్నటితో నరేందర్ రిమాండ్ గడువు ముగియగా.. పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరు పరిచారు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ ను డిసెంబర్ 11 వరకూ పొడిగిస్తూ జూనియర్ సివిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఫార్మా కంపెనీ భూసేకరణ నేపథ్యంలో లగచర్లకు వెళ్లిన అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే.