వంటింటి పోపుల డబ్బాలో ఉండే ఆవాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆవాలలో కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, పాస్ఫరస్ తదితర మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి తినటం వల్ల శ్వాసకోశ సమస్యలు, నొప్పులు, జీర్ణ సమస్యల నుంచి బయటపడవచ్చు. శరీర మెటబాలిజాన్ని పెంచుతాయి. హైబీపీని తగ్గిస్తాయి. ఆస్తమా ఉన్నవారు ఆవాలను ఆహారంలో భాగం చేసుకుంటే ఫలితం ఉంటుంది. ఫంగస్, ఇతర చర్మ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు ఆవాలను తింటే ప్రయోజనం ఉంటుంది.