వారఫలాలు (ఫిబ్రవరి 06 - ఫిబ్రవరి 12)

31810చూసినవారు
వారఫలాలు (ఫిబ్రవరి 06 - ఫిబ్రవరి 12)
మేషం
ఉద్యోగబలం పెరుగుతుంది. శ్రమను బట్టి ఫలితముంటుంది కాబట్టి కృషి పెంచండి. అపార్థాలకు తావివ్వవద్దు. దృఢ సంకల్పంతో ముందడుగు వేయండి. ధర్మమార్గంలో కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు. వ్యాపారరీత్యా శ్రమ పెరుగుతుంది. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేయండి. ఇష్టదైవాన్ని పూజించండి, అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది.

వృషభం
కార్యసిద్ధి ఉంది. అవరోధాలను సమర్థంగా అధిగమిస్తారు. మనోబలంతో పని మొదలుపెట్టాలి. విఘ్నాలను తెలివిగా పరిష్కరించండి. లక్ష్యం సిద్ధించేవరకూ శ్రమిస్తూనే ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి. వారాంతంలో సంతృప్తికర ఫలితాలుంటాయి. ఇష్టదైవారాధన మంచిది.

మిథునం
అనుకూల కాలం. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. కాలానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. అదృష్టయోగముంది. అభీష్టసిద్ధి కలుగుతుంది. అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. దైవబలం కాపాడు తోంది. శ్రేష్ఠమైన జీవితం లభిస్తుంది. సూర్య ఆరాధన మంచిది.

కర్కాటకం
ధైర్యంగా పని మొదలెట్టండి. విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. చంచలత్వం లేకుండా ఆలోచించాలి. చెడు ఊహించవద్దు. అపోహ పడేవారున్నారు. పొర పాటు లేకపోయినా నిందలు మోపే పరిస్థితి కనిపిస్తోంది. సమయ స్ఫూర్తితో శాంతి లభిస్తుంది. ఒక ప్రయత్నం సఫలమవుతుంది. వారం చివర మంచి జరుగుతుంది. ఇష్టదైవస్మరణ శుభప్రదం.

సింహం
సంతృప్తికర ఫలితాలున్నాయి. ఉద్యోగంలో గౌరవపురస్కారాలు లభిస్తాయి. ధనలాభం సూచితం. వ్యాపారంలో అభివృద్ధి విశేషంగా ఉంది. సన్మార్గంలో ముందుకు సాగండి. మీవల్ల కొందరికి మంచి జరుగుతుంది. గృహ, భూ యోగాలు కలిసివస్తాయి. వాహనసౌఖ్యం ఉంది. దైవబలంతో శత్రుదోషమూ ఆపదలూ తొలగుతాయి. లక్ష్మీధ్యానం శ్రేయస్కరం.

కన్య
కాలం వ్యతిరేకంగా ఉంది. శాంతంగా ఉండాలి. అపార్థాలకు అవకాశమివ్వకూడదు. ప్రతి అంశాన్నీ లోతుగా ఆలోచించండి. మౌనం మంచిది. కాలం క్రమంగా సహకరిస్తుంది. ధనలాభం ఉంటుంది. వ్యాపారం కలిసి వస్తుంది. వారం మధ్యలో ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. శుభవార్త వింటారు. ఇష్టదైవారాధనతో శాంతి చేకూరుతుంది.

తుల
కాలం సహకరిస్తోంది. ఎటుచూసినా మంచే గోచరిస్తోంది. కార్యసిద్ధి ఉంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి పెద్దల అనుగ్రహాన్ని పొందాలి. సాహసనిర్ణయాలు శక్తిని ఇస్తాయి. ఉద్యోగరీత్యా కలిసి వస్తుంది. సమాజంలో గొప్ప కీర్తి లభిస్తుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. పలు మార్గాల్లో సంపాదన వస్తుంది. ఇష్టదేవతను తలచుకోండి, మనశ్శాంతి ఉంటుంది.

వృశ్చికం
కార్యసిద్ధి విశేషం. పలు మార్గాల్లో లాభాలున్నాయి. ఆశయసాధనలో ముందడుగు పడుతుంది. స్థిరత్వం వస్తుంది. అధికారలాభం సూచితం. వ్యాపారబలం పెరుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. చంచలత్వం పనికిరాదు. తెలియని ఆటంకాలున్నాయి. వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయాలి. శివస్మరణ ఉత్తమం.

ధనుస్సు
వ్యాపార యోగం బాగుంది. ఆర్థికంగా శుభకాలం. ఉద్యోగంలో మిశ్రమ ఫలం ఉంటుంది. కొన్ని విషయాల్లో స్పష్టత లోపిస్తుంది. దగ్గరివారి సూచనలు తీసుకోండి. పట్టువిడుపులతో లక్ష్యం సిద్ధిస్తుంది. మనోబలం అవసరం. ఎవరేమన్నా పట్టించుకోవద్దు. ఓర్పు వహించాలి. ప్రసన్నంగా ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకోండి. ఆంజనేయస్వామిని స్మరించండి, శక్తి పెరుగుతుంది.

మకరం
ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. మీ నిర్ణయాలను ధైర్యంగా తెలపండి. దేనికీ వెనుకాడవద్దు. ఆశించిన ఫలితం వస్తుంది. మొహమాటం పనికిరాదు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. బంధుమిత్రులతో ఆనందించే అంశాలున్నాయి. ఇంట్లోవారి ద్వారా మంచివార్త వింటారు. వ్యాపారరీత్యా జాగ్రత్తపడాలి. తెలియనివారితో చనువు మంచిది కాదు. ఈశ్వరధ్యానం శుభకరం.

కుంభం
శుభాలున్నాయి. త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. పనిమీద శ్రద్ధ పెంచండి. ధర్మం ముందుకు నడిపిస్తుంది. చురుకైన నిర్ణయాలు అవసరం. కొన్ని సందర్భాలు నిరుత్సాహాన్నిస్తాయి. అశాంతికి గురిచేసేవారున్నారు. శాంతంగా ఉండండి. పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. తొందరవద్దు. మొత్తంమీద ఆనందించే అంశముంది. శివారాధన ఉత్తమం.

మీనం
కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. ఉన్నతాశ యాలతో ఉత్తమ కార్యాలను సాధించండి. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసివస్తుంది. కోరుకున్నది దక్కుతుంది. మిత్రులకు తోడ్పాటునందిస్తారు. తొందరపాటు వల్ల పొరపాటు జరగకుండా సంయమనాన్ని పాటించండి. కుటుంబపరంగా శాంతి లభిస్తుంది. ఒకవార్త ఆనందాన్నిస్తుంది. ఇష్టదేవతను ధ్యానిస్తే మంచిది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్