BRS చీఫ్ కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉంటే చూపించాలని.. ఒకవేళ నిరూపిస్తే అది రేవంత్‌కే రాసిస్తా అని మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి విలువలు ఉండవని.. డబ్బు సంచులతో దొరికిన దొంగ అని మండిపడ్డారు. సీఎంతో పాటు మంత్రులకు కూడా అవగాహన లేదన్నారు.