భారత యువ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడుతున్నాడు. మరికొద్ది నెలల్లో IPL 2025 వేలం కూడా జరుగనుంది. ఈ క్రమంలో KKR తనను విడుదల చేయడానికి ఎంచుకుంటే ఏ జట్టును ఇష్టపడతారని అడిగిన ప్రశ్నకు రింకూ ఆసక్తికర జవాబిచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కోసం మునుపటి కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి ఆడాలని ఉందని తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు.