చాలామంది అందంగా కనిపించాలని ఎన్నో ట్రీట్‌మెంట్‌లు చేయించుకుంటారు. అలాగే పాదాలు కూడా అందంగా కనిపించేందుకు ఫిష్ స్పా వంటి ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నారు. ఈ ఫిష్ స్పా ట్రీట్‌మెంట్‌లు కొన్ని తీవ్రమైన హానిని కలిగిస్తాయట. ఈ ట్రీట్‌మెంట్‌లో బాగంగా చిన్న చేపలు పాదాల్లోని మృతకణాలను తింటాయి. ఈ క్రమంలో సోరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధులు సోకిన వారిని కొరికిన తర్వాత ఆ చేపలు మిమ్మల్ని కొరికితే, ఈ వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.