ఛత్తీస్‌గఢ్ ఆర్థికమంత్రి ఒ.పి చౌధరి రాష్ట్ర బడ్జ్‌ట్‌ను స్వయంగా తన చేతితో రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేతితో రాయడం వల్ల తన భావాలను, ఉద్వేగాలను, దార్శనికతను, కట్టుబాటును పూర్తిగా అర్థం చేసుకోవడానికే చేతితో రాసినట్లు పేర్కొన్నారు. నాలుగురోజుల పాటు కష్టపడి రోజుకు గంట సేపే నిద్రపోయి బడ్జెట్‌ను తయారుచేసినట్లు చెప్పారు. ఇలా రాయడం ఇదే తొలిసారి అయింటుందని ఆయన భావిస్తున్నారు.