కుళ్లిపోయిన ఆహారం పెడుతున్నారంటూ సికింద్రాబాద్ పీజీ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పుడ్ బాగొలేదంటూ శనివారం కాలేజీ హాస్టల్ ముందు కూర్చొని నిరసన చేపట్టారు. రాత్రి మిగిలిపోయిన భోజనాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా ఇస్తున్నారని, కుళ్లిపోయిన ఫుడ్ తినడం వల్ల పలువురికి ఫుడ్ పాయిజన్ అయ్యిందని మండిపడుతున్నారు. దీంతో కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.