మహారాష్ట్రలో మహాయుతి కూటమి (బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ NCP) భారీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి (కాంగ్రెస్, ఉద్ధవ్ థాక్రే శివసేన, శరద్ పవార్ NCP) చతికిలపడింది. మహాయుతి కూటమి గెలుపులో 'లాడ్లీ బెహనా యోజన' పథకం కీలక పాత్ర పోషించింది. ఈ స్కీమ్‌లో మహిళలకు ఇచ్చే సాయం రూ.2,100కి పెంచుతామని మహాయుతి ప్రకటించింది. దీంతో మహాయుతికే మహిళలు జై కొట్టినట్లు స్పష్టం అవుతోంది.